1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Sanjana

Raja| Sanjana| Make-up| Samardhudu| Originality| Gossip | మేకప్‌కంటే ఒరిజినాలిటీకే ప్రాధాన్యత: సంజన

రాజాతో ప్రేమా? అబ్బే అటువంటిది ఏమీలేదు..!

రాజా
WD
మొహానికి రంగులు పూసుకోవడం.. అనేది తనకు తగనిదని, పరిమతం మేరకే మేకప్ వేసుకుంటానని నటి సంజన అంటోంది. తాజాగా బ్యూటీ హీరో రాజాతో కలిసి "సమర్థుడు"లో నటించింది. తాను మేకప్‌కంటే ఒరిజినాలిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది.

ఎక్కువగా నీళ్ళుతాగుతానని, కొబ్బరిబొండాలు, పళ్లరసాలు సేవిస్తానని చెబుతోన్న ఈ బ్యూటీ గర్ల్ సంజన బుధవారం ఓ ఫంక్షన్‌లో హాజరైంది. ఈ సందర్భంగా మేకప్ టిప్స్ గురించి సంజన ఇలా చెప్పుకొచ్చింది. విదేశీ నటీమణులు ఎక్కువగా మేకప్ వేసుకోరని, సహజత్వానికే ముఖ్యత్వం ఇస్తారంది. విదేశీ నటీమణుల బాటలోనే తాను కూడా పయనిస్తానని, మొహానికి ఎక్కువగా మేకప్ వేసుకున్నా.. చూడ్డానికి అసహ్యంగా ఉంటుందని సంజనా వెల్లడించింది.

రాజాతో ప్రేమాయణం కొనసాగిస్తున్న వార్తలపై సంజన స్పందిస్తూ.. రాజాతో ప్రేమా..? అటువంటిది ఏమీ లేదని, ఎప్పుడు చాలా సరదాగా ఉంటాడని, తనతో నటించే హీరోయిన్లపై ఆయన శ్రద్ధ తీసుకుంటాడని తెలిపింది. దీన్ని ఏవేవో ఊహించి కొన్ని వెబ్‌సైట్లు గాసిప్స్ రాసేశాయని సంజన చెప్పింది. మళ్ళీ అవకాశం వస్తే రాజాతో నటించడానికి రెడీ అంటోంది.

ఇంకేముంది..? సంజన రాజాతో నటించాలనుకుంటే మాత్రమే సరిపోదు. రాజా-సంజన కాంబినేషన్‌లో సినిమా తీసే నిర్మాత కావాలి గదా. కొసమెరుపు ఏమిటంటే..? రాజా నిర్మాతగామారి ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఇంకా హీరోయిన్‌ను ఎంపికచేయలేదు. మరి ఈమెనే సెలక్ట్ చేస్తాడేమో వేచి చూడాలి..!
About Writer
SELVI.M