1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. నేనుండగా.. నువ్వెందుకు..?: కాజల్‌పై చిందులేసిన ఛార్మి

Kajal Agarwal, Charmi, Cinema, Jealous, Heroines, MagaDheera, Chandamama | నేనుండగా.. నువ్వెందుకు..?: కాజల్‌పై చిందులేసిన ఛార్మి

కాజల్ అగర్వాల్
WD
ఏ రంగంలోనైనా ప్రొఫెషనల్ జెలసీ కామనే. సినిమా, రాజకీయ రంగాల్లో అసూయ మరీ ఎక్కువ.

సినీ హీరోయిన్ల సంగతి కొస్తే.. అబ్బో ఒకరిపై ఒకరికి.. అందాలు, రెమ్యునరేష్, ఆఫర్లపై ఈర్ష్య పడుతూ ఉంటారు. కానీ బయటికి మాత్రం చూపించుకోరు. కానీ అందాల ముద్దుగుమ్మ ఛార్మి కాజల్‌పై ఓ ఫంక్షన్‌లో ఆక్రోశం వ్యక్తం చేసిందట.

అసలు కారణమేమిటంటే..? గతంలో బిగ్-సి అనే సెల్‌ఫోన్‌కు ఛార్మి అంబాసిడర్‌గా ఉండేది. అప్పటికి ఛార్మి, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో కొద్దిగా బిజీగా ఉండేది. ఆ టైమ్‌లో రెమ్యునరేషన్ కూడా పెంచడంతో బిగ్-సి వారు ఛార్మిని పెండింగ్‌లో పెట్టారు.

ఈ నేపథ్యంలో "చందమామ"తో గుడ్‌లుక్ ఉన్న కాజల్‌కు ఇటీవలే "మగధీర" హిట్ కావడంతో బిగ్-సి వారు కాజల్‌ను సంప్రదించారు. వెంటనే కాజల్ వారు చెప్పినమాటకు ఒప్పేసుకుని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో కాజల్ బిగ్-సి యాడ్స్ కంటెన్యూగా చేస్తోంది.

దీంతో ఆవేశానికి గురైన ఛార్మి.. తానుండగా నువ్వెందుకని ఓ ఫంక్షన్‌లో కాజల్‌పై ఆక్రోశం వ్యక్తం చేసిందట. ఇదంతా తనకు తెలియదని, బిగ్-సివారు అడగడంతో తాను చేస్తున్నానని వివరణ ఇచ్చిందట. ఏది ఏమైనా.. హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. రాయల్‌గా ఉండాలని, తాను అలాగే ఉంటానని ఛార్మి అంటోంది.
About Writer
SELVI.M