Genelia| Cinema| Industry| Lady-Oriented| Bommarillu| Katha| Tollywood| Hindi | కింగ్స్ మధ్య క్వీన్ స్టోరీలా..? కాస్త కష్టమే..!!
WD
టాలీవుడ్‌లో మనోరమ, మంత్ర వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలు వస్తున్న ఈ సీజన్‌లో.. మొదటి నుంచి ఎక్కడున్నా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తానని హాసిని వెల్లడించింది.
మనకంటూ గుర్తింపు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే తప్ప, ఇందులో ఎవరికి ఎవరూ పోటీకాదని జెన్నీ చెప్పింది. హిందీలో "జానే..తు" తర్వాత గుర్తింపు రావడంతోనే.. తెలుగులో గొప్పపేరు తెచ్చుకోవడం జరిగిందని జెనీలియా అంటోంది. అదీ "బొమ్మరిల్లు" సినిమా తనకు సంపాదించిపెట్టిన గుర్తింపును ఎప్పటికీ మరిచిపోలేనని ఈ చెలాకీ భామ పేర్కొంది.
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయిన తనకు మోడలింగ్‌ద్వారా సినిమాల్లో అవకాశాలు వచ్చాయని హాసిని అంది. ఇంకేముంది..? మరి జెన్నీ లేడిఓరియెంటెడ్ పాత్రలు పోషిస్తుందో? లేదో? తెలియాలంటే.. ఇంకా కొన్నాళ్లు వేచి చూడాలి.
కానీ.. ఇప్పటికే తన తాజా చిత్రం "కథ"లో జెనీలియా లేడిఓరియెంటెడ్ పాత్రను పోషిస్తోందని సినీ వర్గాల్లో టాక్. మరోవైపు హిందీలో రెండు చిత్రాల్లో జెన్నీ నటిస్తోంది.
