Kangana Raunat | Hot Actress | Beauty lips | Elergy | కంగనా పెదవులు ఎర్రగా వాచిపోయాయట...!!
WD
ఇటీవల బాలీవుడ్ సెక్సీ డాళ్ నిరవధికంగా ఓ నెలరోజులపాటు షూటింగ్‌లో పాల్గొన్న కారణంగా కాస్త సుస్తీ చేస్తే ఇటలీ వెళ్లిందట. ఆమె ఏ సమస్యతో ఇటలీ వెళ్లిందో కానీ వచ్చేటపుడు చూస్తూ ఆమె పెదవులు ఎర్రగా... వాచిపోయి కనిపించాయట. అంతే ఇక పత్రికలవారు తమ పెన్నులకు పని చెప్పారట. పెదవులు వాచిపోవడానికి కారణం ఏమిటన్న అంశంపై ఎవరికి తోచిన వార్తలు వారు రాసి పారేశారట.
పత్రికల రాతలు చూసి కంగానా కంగుతిన్నదట. పత్రికలవాళ్లందరినీ పనిగట్టుకుని పిలిపించి... ఎలర్జీ వల్ల తన పెదవులు వాచిపోయాయని పెదవులను కదపకుండా సమాధానం చెప్పిందట. పాపం మాట్లాడలేనంతగా పెదవులకు ఎలర్జీ సోకిందన్నమాట. ఇంతకీ ఆ ఎలర్జీ ఎలా సోకిందబ్బా...? అని మళ్లీ ఓ జర్నలిస్టు ప్రశ్నిచేసరికి... కంగనా పళ్లు పట పట నూరిందట. అంతే, ఆ పత్రికా సమావేశం స్టాప్.
