1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. wife Ramlatha

Prabhu Deva | wife Ramlatha | Nayanatara | Relation | ప్రభుదేవా భార్య ఏమంటే నాకేంటీ...?

ప్రభుదేవా
FILE
నయనతార- ప్రభుదేవా ఇద్దరి మధ్య లవ్వాట సాగుతోందని అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఒకటే గుసగసలుపోతున్నాయి. ఈ మాట ప్రభుదేవా భార్య రామలత చెవిన పడటంతో కోపంతో ఊగిపోయిందట. "నా మొగుడిని వలలో వేసుకోవడానికి నీకెంత ధైర్యం... ఇంకోసారి నా మొగుడితో కనబడ్డావో నా చేతుల్లో నీకు దెబ్బలు తప్పవు. జాగ్రత్త!!" అని నయనను హెచ్చరించిదట.

రామలత హెచ్చరికను కొందరు పత్రికా విలేకరులు నయనతార దృష్టికి తీసుకుని వెళ్లగా... అసలు ఆ విషయంపై తాను మాట్లాడదలుచుకోలేదని అందట. చెత్తరాతలు రాసే కొన్ని తమిళ, ఇంగ్లీషు పత్రికలను తాను చూడటమే లేదనీ, తాను చెప్పని మాటలను కూడా చెప్పినట్లు కొన్ని పత్రికలు రాసి... విలువల్ని దిగజారుస్తున్నాయని మండిపడిందట.

అదిసరే ప్రభుదేవాతో మీకు సన్నిహిత స్నేహం ఉన్నదన్న వార్త నిజమేనా...? అని అంటే.. "సినీ ప్రపంచంలో హీరోహీరోయిన్లు స్నేహంగానే ఉంటారు. అందులో తప్పేమీ లేదు. అయితే ఆ స్నేహాన్ని కొందరు వక్రీకరిస్తూ పొగ వార్తలు రాస్తుంటారు. కనుక అటువంటి వార్తల గురించి నేనసలు పట్టించుకోనని చెప్పిందట నయన. నయనది ఎంతో విశాల హృదయంలా అనిపించడం లేదూ...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT