1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Aishwarya Rai

Asin | Aishwarya Rai | Ashutosh Gowariker | Khelein Hum Jee Jaan Sey | Abhishek Bachchan | ఐశ్వర్యారాయ్ బూట్లలో అసిన్ కాళ్లు

ఐశ్వర్యారాయ్
ప్రపంచ సుందరిగా పేరుప్రఖ్యాతులు గాంచి, అటుపిమ్మట బాలీవుడ్ రారాణిగా వెలుగొందుతోన్న ఐశ్వర్య స్థానాన్ని దక్షిణాది తార అసిన్ ఆక్రమించబోతోందా...? అవుననే అనుకోవాల్సి వస్తోంది. 

బాలీవుడ్ దర్శక నిర్మాత అశుతోష్ గౌరికర్ త్వరలో నిర్మించబోతున్న "ఖేలీన్ హమ్ జీ జాన్ సే" చిత్రంలో తొలుత ఐశ్వర్యను అనుకున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం అశుతోష్‌‌ను అసిన్ అతని కార్యాలయంలో కలిసిందట. ఇద్దరి మధ్య సుదీర్ఘమైన సంభాషణ జరిగిందట. అంతే ఆ మరుసటి రోజు తన తదుపరి చిత్రంలో అసిన్ కథానాయికగా నటించబోతోందని అశుతోష్ ప్రకటించేశాడట.

ఎందుకిలా...? అని ఆరా తీస్తే... అశుతోష్ ఇలా చెప్పాడట. "అసిన్ చాలా మంచి అమ్మాయి. కొంతమంది నా చిత్రంలో నటిస్తావా...? అని అడిగితే, కథ ఎలాంటిది.. పాత్ర ఎలాంటిది... నా మొగుడికి ఛాన్సిస్తావా..? నా బాయ్ ఫ్రెండ్‌కు కూడా ఛాన్సిస్తావా...? అంటూ ప్రశ్నలతో వేధిస్తారు. కానీ అసిన్ మాత్రం అదేం అడగలేదు. జస్ట్.. నాతో కలిసి సినిమా చేస్తావా.? అనడిగా. అంతే వెనక ముందూ చూడకుండా వెంటనే సంతకం చేసేసింది" అని అసిన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడట.

అన్నట్లు ఐశ్వర్యకు కొందరు నిర్మాతలు హ్యాండ్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. అదేమంటే... తను నటించే చిత్రంలో అభిషేక్ బచ్చన్‌కు ఖచ్చితంగా ఛాన్సివ్వాలని మొండి పట్టుదల పడుతుందట. దాంతో చిర్రెత్తిపోతున్న నిర్మాతలు క్రమంగా ఐష్‌కు మొండిచేయి చూపుతున్నారట. అవును మరీ... నటించే ప్రతి సినిమాలోనూ మొగుడినే హీరోగా పెట్టుకోమంటే, ఆ చిత్రం "ఫట్" మనదూ...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT