గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » "గజిని"తో దక్షిణాది దర్శకులవైపు బాలీవుడ్ నిర్మాతల దృష్టి! (Cinema| Bollywood| Directors| Producers| Gajini| Amir Khan| Asin| Trisha| Akshay Kumar| Priyadarshan)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
Ameer Khan
WD
కోలీవుడ్‌లో మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన "గజిని" సినిమాతో దక్షిణాది దర్శకులకు డిమాండ్ పెరిగిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అమీర్ ఖాన్, అసిన్ హీరోహీరోయిన్లుగా హిందీలో తీసిన "గజిని"కూడా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోవడంతో బాలీవుడ్ నిర్మాతల దృష్టి దక్షిణాది దర్శకులవైపు మళ్లింది.

అంతకుముందు యాక్షన్ హీరోలపై బాలీవుడ్ చిన్న చూపు ఉండేది. కానీ "గజిని" విజయం సాధించిన తర్వాత ఆ ధోరణి మారిందని దక్షిణాది సినీ విశ్లేషకులు అంటున్నారు. కాగా.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన దర్శకులు సామాన్యుల నాడి పట్టుకున్నారని, వారితో హిందీ రంగం పలు సినిమాలు తీయబోతుందని వాంటెడ్ నిర్మాత బోనీకపూర్ వెల్లడించడం ఇందులో విశేషం.

ఇంకేముంది..? ఇప్పుటికే మురుగదాస్ "గజినీ" సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేయగా, మరో కోలీవుడ్ డైరక్టర్ ప్రియదర్శన్.. త్రిష, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో "కట్టా మీఠా" చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అక్షయ్ కుమార్ సొంత బేనర్‌పై, స్వీయ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సినిమా, బాలీవుడ్, దర్శకులు, నిర్మాతలు, త్రిష, అక్షయ్ కుమార్, ప్రియదర్శన్, గజినీ, అమీర్ ఖాన్, అసిన్