1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Bollywood Actress

Kangana Ranaut | Bollywood Actress | Hot actress | Tollywood | ఏ భంగిమలో కావాలో చెప్పండి... ఫోజిస్తా: కంగనా

కంగనా రనౌత్
టాలీవుడ్‌కు ఇప్పుడు కంగనా ఫీవర్ పట్టుకుంది. మొన్నటివరకూ టాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలిన బక్కపలచని హీరోయిన్లను కాదని కంగనా రనౌత్ వెంటపడుతున్నారట తెలుగు సినీ నిర్మాతలు. పైగా రనౌత్ కలుపుగోలుతనాన్ని చూసిన నిర్మాతలు "ఐస్" అయిపోతున్నారట. 

నిర్మాతలు ఎలా అడిగితే అలా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, తెలుగు దర్శకనిర్మాతల పనితీరు తనకు ఎంతో బాగా నచ్చిందని వారికి మరింత "ఐస్" పెడుతోందట కంగనా.

అంతేకాదండోయ్... ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఫలానా ఫోజు కావాలి మిస్ అని అడిగిందే తడవుగా... వారికి కావలసిన ఫోజు ఇవ్వడమే కాక "ఇంకా ఏ భంగిమలో కావాలో చెప్పండి... ఫోజిస్తా" అని అంటోందట. కంగనా మాటలతో ఫోటోగ్రాఫర్ల సైతం గుల్లైపోతున్నారట.

కంగనా వరస చూస్తుంటే టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న హీరోయిన్లందరినీ బీట్ చేస్తుందంటున్నారు టాలీవుడ్ సినీజనం. అన్నట్లు కంగనా పెదవులు ఇటీవల దొండపండు ఎరుపు టైపులో ఎరుపెక్కాయట. అంతేకాదు బాగా వాచిపోయాయట. కారణం ఏమై ఉంటుందోనన్న సంగతి తెలుసుకునేందుకు మన పిల్ల జర్నలిస్టు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ తెలిస్తే చెపుతానన్నాడు... ఏం చెపుతాడో చూద్దాం...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT