Bhuvaneswari | Brothal Case | Chennai | Adayar | Cinema | పడువువృత్తిలో పలువురు హీరోయిన్లు: భువనేశ్వరి
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోయిన్లు పడుపువృత్తి చేస్తున్నారని బుల్లితెర నటి భువనేశ్వరి బాంబులాంటి వార్త పేల్చారు. పలు చిన్న చిత్రాలతో పాటు అనేక టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ఈమె. ఇటీవల తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని అడయారులో ఒక బంగాళాలో వ్యభిచారం చేస్తూ రెడ్‌హ్యాడెండ్‌గా ఆ రాష్ట్ర పోలీసులకు చిక్కిపోయింది. ఆమెను ప్రస్తుతం చెన్నయ్ శివారు ప్రాంతంలో ఉన్న పుళల్ కేంద్ర కారాగారంలో ఉంచారు.
గతంలో కూడా ఇదే కేసు కింద అరెస్టు అయిన భువనేశ్వరి.. ఆ తర్వాత పలువురు సినీ పెద్దల జోక్యంతో నిర్ధోషిగా బయటపడ్డారు. అయితే, ఈ దఫా మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పడువు వృత్తిలో ఉండగా ఆమెతో పాటు.. ఇద్దరు విటులను సైతం వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆమెకు ఇక జైలే జీవితంలా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తన అరెస్టుపై భువనేశ్వరి కోర్టు ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. ఈ వృత్తిలో అనేక మంది హీరోయిన్లు ఉన్నారని చెప్పారు. అవకాశాలు లేని పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం దీన్నే నమ్ముకుని జీవితాన్ని గడుపుతున్నారని తెలిపింది. వీరి చిట్టాను త్వరలోనే బయటపెడతానని ఆమె ప్రకటించింది.
