Trisha| Arundhati| Entertainment| Hero| Success| Lady Oriented Roles| Party | "అరుంధతి" సినిమాను నేనింకా చూడలేదు: త్రిష
మనం ఏ రంగంలో పనిచేస్తున్నామో.. ఆ ఫీల్డు గురించి బాగా తెలుసుకోవడం సహజం. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్నవారికి ఆ రంగంపై పూర్తి అవగాహన ఉండటం అవసరమని పొడవుకాళ్ల సుందరి, సొట్ట బుగ్గల చిన్నది త్రిష అంటోంది.
పక్కాహీరో సినిమా సక్సెస్ అయితే అది ఎందుకు సక్సెస్ అయిందో చూడటం పరిపాటే. అయితే లేడిఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా "అరుంధతి" చిత్రాన్ని తానింకా చూడనేలేదని త్రిష చెబుతోంది.
పైగా మహిళా ప్రాధాన్యతగల చిత్రాలు చేయాలని ఉంది. కానీ అవకాశాలు రావడం లేదని త్రిష అంటోంది. మంచి కథ, మంచి దర్శకుడు దొరికితే చాలు. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తానని ప్రకటించేసింది.
ఇంకా తాను పరిస్థితులకు తగినట్లు ప్రవర్తిస్తానని త్రిష చెబుతోంది. ఏ ఎండకా గొడుగు.. అంటే.. తనను మరీ అంత తక్కువగా అంచనా వేయకండని హితవు పలికింది. పార్టీలకు వెళ్లి.. వెళ్లలేదని అసత్యాలు చెప్పే రకం తాను కాదు. ఏ పనిచేసినా ధైర్యంగా నలుగురితో చెబుతానని త్రిష అంటోంది. మరి నిజమేనని అనుకోవాలా..!?
