Tarun| Tanish| Nachavule| Ride| Mouna Ragam| Manchivadu| Success | "తరుణ్" ఛాన్సును కొట్టేసిన నచ్చావులే "తనీష్"!
WD
తరుణ్‌కు ఈ మధ్య సక్సెస్‌లు లేకపోవడంతో.. ఓ కొత్త సినిమా కాల్షీట్‌ను యంగ్ హీరో తనీష్ దక్కించుకున్నాడని తెలిసింది. "నచ్చావులే" హీరోగా మంచిపేరు తెచ్చుకున్న తనీష్ ఆ తర్వాత "రైడ్" చిత్రంలో నటించాడు. అదీ నిర్మాతకు మంచి సక్సెస్ ఇవ్వడంతో మిగిలిన నిర్మాతలందరూ తనీష్ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం "మౌనరాగం", "మంచివాడు" వంటి చిత్రాల్లో తనీష్ నటిస్తున్నాడు. ఆ అవకాశాలు ముందుగా తరుణ్‌కు వచ్చాయి. కానీ అది బాగాలేదు. ఇది బాగాలేదంటూ.. తరుణ్ కారణాలు చెప్పడంతో.. నిర్మాతలకు చెర్రెత్తి ఓకేసార్.. అంటూ వెనక్కితగ్గి తనీష్‌ను సంప్రదించారు.
ఇకపోతే.. తనీష్ కూడా తరుణ్‌లా బాలనటుడే. ఆల్‌రెడీ ఉదయ్‌కిరణ్ స్థానాన్ని సిద్ధార్థ, హ్యాపీడేస్ వంశీలు దక్కించుకున్నారనే విషయం తెలిసిందే. ఇంకేముంది..? ప్రస్తుతానికి టాలీవుడ్ యంగ్ హీరోలకే క్రేజ్ ఎక్కువగా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
