Anushka| Cinema| Arundhati| Panchakshari| Lady Oriented| Billa| Glamour | "పంచాక్షరి"గా వస్తోన్న "అరుంధతి" బొమ్మాళీ!
"అరుంధతి" చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించిన అందాల తార, సొట్టబుగ్గల చిన్నది అనుష్క.. మళ్లీ లేడిఓరియెంటెడ్ పాత్రలో నటించబోతోందని సమాచారం. నాగార్జున పర్సనల్ మేకప్‌మెన్ చందు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిసింది.
ప్రముఖ దర్శకుడు సముద్ర డైరక్షన్‌లో డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు "పంచాక్షరి" అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
"అరుంధతి"లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క.. సముద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. "అరుంధతి" తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన "బిల్లా"లో అనుష్క తన అందచందాలను అభిమానులు ఆశ్చర్యపడే రీతిలో అందాలను ఆరబోసిన విషయం తెలిసిందే.
