Chiru | Worried | Charan's | Acts | Magadheera | Bike Stunt | Sky Diving | తనయుడు చరణ్ సాహసాలపై మెగాస్టార్ ఆందోళన!
File
FILE"మగధీర" చిత్రంలో అద్భుతమైన, సాహసోపేతమైన బైక్ స్టంట్ చేసి చిత్రపరిశ్రమను అబ్బురపరిచిన విషయం తెల్సిందే. ఇందుకోసం చరణ్ పడిన కష్టానికి ఫలితం ఈ చిత్రం విజయంలో లభించింది. అయితే, చరణ్ సాహసాలు ఆయన అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తుంటే.. చిరంజీవికి మాత్రం బెంగపట్టుకుందట.
చరణ్ నటించే కొత్త చిత్రంలో మరో సాహసం చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే స్కై డైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన చరణ్.. ఈ డైవింగ్‌ను తన తదుపరి చిత్రంలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఈ సాహసానికి దూరంగా ఉంటాడో లేదా తన అభిమానులను మరింత ఉత్సాహ పరిచేందుకు డాడీని ఒప్పించి స్కై డైవింగ్ చేస్తారో వేచి చూడాల్సిందే.
