Charan | wants | Kajal | Orange | Muhurtham | Genelia | Bommarillu Bhaskar | కాజల్ అగర్వాల్‌పై మనస్సు పారేసుకున్న రామ్ చరణ్
File
FILEఅందుకే.. తన తదుపరి చిత్రం "ఆరంజ్"లో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయాలని దర్శకుడుకి చరణ్ చూసించినట్టు సమాచారం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు వచ్చే నెల 21వ తేదీన జరుగనున్నాయి. డిసెంబరు మొదటి వారం నుంచి విదేశాల్లో షూటింగ్ రెగ్యులర్ జరుపుకోనుంది.
ఈ చిత్రం కథా పరంగా ఇందులో ఇద్దరు హీరోయిన్లు. అందులో ఒక హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయాలని చరణ్ కోరారట. రెండో హీరోయిన్‌గా జెనీలియాను ఎంపిక చేశారు. ఈ పాత్ర చాలా తక్కువగా ఉండటం వల్ల ఆమె నిరాకరించినట్టు సమాచారం.
దీంతో రామ్ చరణ్ తలదూర్చి రెండో హీరోయిన్ పాత్ర నిడివి పెంచాలని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ను కోరారు. కాగా, ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై చిరంజీవి సోదరుడు కె.నాగబాబు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
