Sexy actress | Trisha | Dreams | Sky | రెక్కలుండవు... కానీ ఆకాశంలో ఎగురుతుంటా: త్రిష
యవ్వనంలో ఉన్న అమ్మాయికి ఎటువంటి కలలు వస్తాయి...? సహజంగా రాకుమారుడు లాంటి భర్త కావాలన్న కలలు వస్తాయి. కానీ త్రిషకు మాత్రం కళ్లు మూస్తే కొత్త కలలు వెంటాడుతున్నాయట. ఆ కలల సారాంశం కాస్త చెప్పవూ... అని కదిలిస్తే ఇలా చెప్పుకొచ్చింది.
"ఆకాశం నుంచి దూకేసినట్లు తరచూ కల వస్తుంది. ఆకాశంలో నుంచి కిందికి దూకేటపుడు చాలా తేలికగా ఎగురుతూ ఉంటాను. ఎంతసేపటికీ భూమిపైకి రాలేను. భూమికి దూరంగా ఉన్నా కంగారు పడకూడదని అనిపిస్తుంది.
అయితే ఒక్కోసారి పడిపోతానేమోనని భయమేస్తుంది. ఆ భయంతో గొంతు తడారి నాలుక పిడచ కట్టుక పోతుంది. భూమి సమీపించే కొద్దీ నాలో ఆందోళన బయలుదేరుతుంది. భూమ్మీద దబ్బున కింద పడిపోతానేమోనన్న భయం రెట్టింపవుతుంది.
