Aishwarya Rai | Salman khan | Cinema | lyricist Javed Akhtar, | ఐశ్వర్యా... సల్మాన్ సరసన నటించవూ... ప్లీజ్‌జ్!!
IFM
ఇంతకీ కథ ఏమిటని అడిగితే... ఐష్- సల్మాన్ జీవితాలను ఆధారంగా చేసుకుని సాగే ప్రేమకథ అని చెపుతున్నాడట. ఈ చిత్రానికి "అజబ్ హై ఇష్క్" అనే పేరును కూడా నిర్ణయించాడట.
ఇక ఐశ్వర్యారాయ్ అంగీకారమే తరువాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ఐశ్వర్య చెవిన వేశాడట. కానీ ఐష్ వద్ద నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తెలిసింది. సల్మాన్-ఐష్ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం "హమ్ దిల్ దే చుకే సనమ్" బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ కూడా అలాగే పేలిపోయిందనుకోండి. ఆ తర్వాత ఎవరికి వారు విడిపోయారు. ఐష్- అభిని వివాహమాడి జీవితంలో స్థిరపడింది.
ఇప్పుడు కొత్తగా అక్తర్ మరోచరిత్రను సృష్టించాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకదా... రొటీన్‌కి భిన్నంగా ఉన్నప్పుడే బ్రేకో.... షేకో వచ్చేదీ!!
