1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Hot actress

Neetu Chandra | Hot actress | Bikini | Tollywood | Kollywood | అబ్బాయిలు నన్ను గుడ్లప్పగించి చూస్తారు... ఎందుకో?

నీతూ చంద్రా
బికినీలు ధరించి పాపులరైన హాటెస్ట్ తార నీతూ చంద్రా. తెలుగులో అడపాదడపా పాత్రలు వచ్చినా హిట్ రాలేదు కానీ ప్రేక్షకులలో హీట్ కల్గించిందన్న ఇమేజ్ మాత్రం వచ్చింది. టాలీవుడ్‌లో తనకు అవకాశాలు మిణుకు మిణుకు అంటుండంతో చివరికి కోలీవుడ్‌కు తన మకాం మార్చేసింది.

తన రూపం గురించి నీతును ప్రశ్నిస్తే... ఖచ్చితంగా చెప్పడం కష్టం అంటోంది. అసలు తన రూపం ఎవరిలా ఉంటుందో పోల్చుకుని చూడాలని చాలాసార్లు చాలామందిని చూసిందట. ఇంటర్నెట్‌లో తనలాంటి పోలికలున్న వ్యక్తులెవరైనా కనబడతారేమోనని తెగ వెతికిందట. కానీ ప్రయోజనం శూన్యమేనని చెపుతోంది. అంటే తనలాంటి వ్యక్తి ఈ భూ ప్రపంచంలో లేరన్నమాట.

అయితే తను ఎక్కడ కనబడినా అబ్బాయిలు మాత్రం కళ్లార్పకుండా గుడ్లప్పగించి అదేపనిగా చూస్తుంటారనీ, తనలో అంతగా ఆకర్షించే అంశాలు ఏమున్నాయని వారు అలా చూస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం ఉంటుందని చెపుతోందట. మరి నీతూ అడిగితే అబ్బాయిలు ఏం చెపుతారో...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి