Sindhu Menon | Bikini | Hot actress | Tollywood | బికినీలు వేయమంటే వేస్తాను: సింధు మీనన్
భద్రాచలంలో హీరోయిన్‌గా పరిచయమైన బాలనటి సింధు మీనన్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అంత పేరు రాలేదు. చందమామతో తళుక్కుమంది. అయినా ఆ తర్వాత పెద్దగా పిలిచినవారు లేరు. అదేమంటే... తమిళంలో, మలయాళంలో తనకు బోలెడు ఛాన్సులున్నాయని ఊకదంపుడు కబుర్లు చెపుతోంది.
ఇక మన టాలీవుడ్‌లో మాత్రం లేటెస్ట్‌గా సుభద్ర చిత్రంలో నటిస్తోంది. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు ఏవిధంగా ఉంటాయి? అపోహలు వస్తే ఎలా మారుతాయి? అనే పాయింటుతో రూపొందుతోంది. ఈ సందర్భంగా ఆమెను పలుకరిస్తే.. పలు విషయాలు వెల్లడించింది.
లవ్ గురించి చెబుతూ... పనీపాటలేనివాళ్లు చేసే పనిదని చెప్పింది. తనకు అస్సలు ప్రేమించే తీరికే లేదని అంటోంది. మనిషికి ఏదైనా పనుంటే దానిమీద శ్రద్ధపెట్టి కెరీర్ డెవలప్ చేసుకుంటారనీ, అది లేనివారు ప్రేమ అంటూ పిచ్చిపట్టినట్లు తిరుగుతుంటారని చెపుతోంది.
