1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Village Girl

Actress Hansika | Village Girl | Shoab Aktar | Pakistan Cricketer | లంగా- ఓణీ కట్టుకోవడం నాకు తెలీదు: హన్సిక

సెక్సీ నటి హన్సిక
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ సరసన నటించనున్న తెల్లపిల్ల హన్సిక తనకు లంగా-ఓణీ కట్టుకోవడం తెలీదని చెపుతోంది. ఆ వస్త్ర ధారణ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ముంబయిలోని పల్లెటూరి ప్రాంతాలకు వెళ్లి తెలుసుకుంటున్నానని అమయాకంగా చెపుతోంది.

తన బాల్యమంతా నగరాల్లోనే గడిచిపోవడంతో లంగా-ఓణీలు కట్టుకున్న అమ్మాయిలు ఎలా ఉంటారో కూడా తనకు తెలియదని అంటోంది. ఇంతకీ ఈ లంగా-ఓణి గొడవ ఏమిటీ...? అనుకుంటున్నారా..?

షోయబ్ అక్తర్ సరసన నటించే సదరు సినిమాలో హన్సిక ఓ పల్లెటూరి పిల్లలా కన్పించాలట. ఆ చిత్ర నిర్మాత తన పాత్ర గురించి చెప్పినప్పుడు పెల్లటూరి వేషభాషలు తనకు తెలియవని చెప్పిందట హన్సిక. దాంతో సదరు దర్శకుడు ఆచార సంప్రదాయాలను కఠినంగా అమలు జరిగే ఓ మారుమూల పల్లెటూరు పేరు చెప్పి అక్కడ అమ్మాయిల కట్టూబొట్టూ చూసి నేర్చుకోమన్నాడట.

ఇక అప్పట్నుంచీ హన్సిక ఆ ఊరికి వీలుదొరికినప్పుడల్లా చెక్కెర్లు కొడుతోందట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి