Sumanth | Kamalini Mukharjee | Love | New Girl | Party | మళ్లీ ఓ అమ్మాయిని "ప్రేమ"గా చూస్తున్న సుమంత్..?!!
WD
తాజాగా ఇటీవల విరానికా మంచు పార్టీకి వెళ్లిన సుమంత్, అదే పార్టీలో మెరుపు తీగలా ఉన్న ఓ అమ్మాయిని గుడ్లప్పగించి చూస్తుండిపోయాడట. అది గమనించిన సదరు బ్యూటీ గాళ్ మెల్లగా అక్కడ నుంచి మరోచోటకు తన మకాన్ని మార్చిందట. సుమంత్ అక్కడికి కూడా వెళ్లి ఆమెనే గుచ్చి గుచ్చి చూడటం మొదలుపెట్టాడట.
దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ బ్యూటీ నేరుగా పార్టీ హాలులోకి వెళ్లి ఫ్రెండ్స్‌తో మాట్లాడటం ప్రారంభించిందట. సుమంత్ మాత్రం పార్టీ హాలులోకెళ్లి డ్యాన్స్ చేస్తూ అదే స్పీడుతో తనకు నచ్చిన అమ్మాయి వద్దకు వచ్చి లాఘవంగా నడుమున చేయివేసి తనతో నాట్యం చేయించాడట. ఆ అమ్మాయి కూడా తొలుత కాస్త సిగ్గుపడినా తర్వాత సుమంత్‌తో కలిసి ఆడిందట. మరి ఈ ఆట ప్రేమాటగా మారుతుందో.. లేదంటే అక్కడితోనే ఆగిపోతుందో చూడాలి.
