1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. రంభకు "మెగా"లాంటి భర్త దొరికాడట...!!

Actress Rambha, Indran, Canada businessman, Megastar Chiranjeevi | రంభకు "మెగా"లాంటి భర్త దొరికాడట...!!

రంభ
WD
థండర్ థైస్... వండర్ బాడీ అని టాలీవుడ్ ఒకనాడు కీర్తించిన సినీనటి రంభ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగిపోయింది. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్‌తో వివాహం నిశ్చయమైంది. ఇదంతా పాత చింతకాయ పచ్చడి కబురు.

మరి తాజా సంగతేంటి...? అంటారా...? అప్పుడెప్పుడో వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నప్పుడు రంభను మీ ఆయన ఎలా ఉండాలని కోరుకుంటావ్ అనడిగితే... మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌లో ఉండాలని చెప్పిందట.

ఆ తర్వాత గత పదేళ్లుగా "మెగా"లాంటి పురుషునికోసం మహా వేట జరిగింది. తగిన వరునికోసం రంభ దాదాపు దశాబ్దకాలం వేచి చూడాల్సి వచ్చింది. చివరికి ఇంద్రన్ జత కుదరడంతో వివాహానికి సిద్ధమైంది. పెళ్లి కూడా తిరుపతిలో జరుగనుంది.

మొత్తానికి ఇంద్రన్‌ను ఏరికోరి పెళ్లి చేసుకుంటుందంటే... ఇంద్రన్‌లో "ఇంద్ర" క్వాలిటీస్ ఉన్నట్లేనని టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT