Jr NTR | Politics | Telugudesam | Telangana | United Andhra | రాజకీయాలు వద్దు బాబోయ్: జూనియర్ ఎన్టీఆర్
WD
సడెన్‌గా జూనియర్ ఎన్టీఆర్‌లో ఈ మార్పు రావడానికి కారణం ఏమిటోనని ఫిలిమ్ నగర్ వర్గాలు ఆరా తీయగా వారికి ఓ విషయం బోధపడిందట. అదేమంటే... ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారు ఒకవైపు తెలంగాణా... మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాల సెగతో వేడెక్కిపోతున్నారు. "ఎందుకొచ్చిన రాజకీయాలు బాబోయ్..." అని తలలు పట్టుకుని ఇంట్లో కూచుంటున్నారు.
ఆయా ప్రాంతాల ప్రజలకు సమాధానం చెప్పలేక కొందరైతే వారి వారి నియోజకవర్గాలవైపు కన్నెత్తైనా చూడలేకపోతున్నారు. కనుక ఈ సమస్య తీరేదాకా కొత్తవారు రాజకీయాల జోలికి వెళ్లే ప్రశ్నే లేదు. ఇక తారలైతే మరీను. ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడితే మరో ప్రాంత ప్రజలు తమ వాల్ పోస్టర్లను చింపి కుప్పలుగా వేసేస్తారు. కనుక ఈ సమయంలో తారలు రాజకీయాల జోలికి వెళితే అంతే సంగతులు. సో... జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్ 100% కరెక్ట్!!
