Abhinaya Sree | Item Song | Actress | Character Artist | హీరోయిన్లే వాంప్‌ల్లా ఉంటున్నారు.. నాతో పనేంటి..?: అభినయశ్రీ
"అ అంటే అమలాపురం" అంటూ కుర్రకారును వెర్రెత్తించిన ఐటంగర్ల్ అభినయశ్రీకి ఇంకా పెళ్లి వయస్సురాలేదట. ఐటంసాంగ్‌ల ద్వారా సినిమాల్లోకి వచ్చిన ఈ భామ ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రలవైపు మొగ్గుచూపుతుంది.
డాన్స్ చేసిచేసి తనకేకాదు చూసే ప్రేక్షకుడికి కూడా మొహం మొత్తిందని అసలు విషయం బయట పెట్టేసింది. అంతేకాదు.. హీరోయిన్లే వాంప్‌ల్లా ఉంటుంటే ఇక మాతోపనేముందని? నిర్మొహమాటం సెలవిస్తోంది.
ఇక ఐటంసాంగ్‌లు, డాన్స్ అవకాశాలు అంతగా చేతికందకపోవడంతో పెళ్లి చేసేసుకుంటారా? అని అభినయశ్రీని అడిగితే.. ముందు గ్రాఫిక్స్ స్టూడియో ఏర్పాటు కోసం కష్టపడుతున్నా. ఆ రంగంలో ఎదిగాక పెళ్లిగురించి ఆలోచిస్తా. బహుశా కనీసం పెళ్లికి ఆరు సంవత్సరాలైనా పట్టవచ్చునని అభినయశ్రీ చెబుతోంది.
