Actress Nayanatara | Bikini | Simbu | Prbhudeva | Romance | బికినీ వేసుకోవడం వల్ల సినిమా హిట్ అవదు: నయనతార
తొలుత శింబు.. ఇప్పుడు ప్రభుదేవాల ప్రేమాయణంలో బాగా వార్తల్లోకి వచ్చిన నయనతార... చిత్రసీమలో పాపులారిటీయే ముఖ్యమని చెపుతోంది. అంతేకాదు అదెలా సంపాదించుకోవాలనే విషయంలో పెద్దగా విలువలు పాటించనక్కర్లేదని అంటోంది.
గతంలో ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్ హిందీ "గజిని"ని తిరస్కరించింది. అదేమో పెద్ద హిట్టయి కూర్చుంది. అలా ఎందుకు చేశావ్..? అని అడిగితే... "అవును. అలా ఎందుకు కాదన్నానో నాకిప్పటికీ అర్థం కావడం లేదు.. మీకేమైనా తెలుసా...?" అని మనల్నే ప్రశ్నిస్తోంది.
తమిళ 'బిల్లా' చిత్రంలో బికినీ వేయడం వల్ల ఆ చిత్రం హిట్ అయిందా...? అనడిగితే, "సినిమా బాగుంటేనే జనం చూస్తారు.. బికినీలు వేసుకోవడం వల్ల కాదు. అలాగైతే ప్రతి సినిమాలోనూ హీరోయిన్ల చేత బికినీలే వేయిస్తారుగా" అని చమత్కరిస్తోంది.
