1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Priyamani

Jagapati Babu | Priyamani | Relations | Tollywood | అది మీరనుకునే కెమిస్ట్రీ కాదు: జగపతి బాబు

జగపతి బాబు
ప్రియమణి, జగపతి బాబుల మధ్య ప్రేమాయణం సాగుతుందనేది ఇండస్ట్రీలో పాత వార్తే. అయినా ఈ మధ్య ఎక్కువగా ఫంక్షన్లకు ఇద్దరూ అటెండ్ కావడం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. లేటు వయసులో ప్రేమాయణం అంటున్న జగపతిబాబును "ప్రవరాఖ్యుడు"లో రొమాంటిక్ సీన్స్ బాగా పండాయనీ, దీన్నిబట్టి మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరిందని విలేకరులు అడిగారు. 

దీంతో జగపతి బాబు... "మీరడిగే కెమిస్ట్రీ నాకు తెలుసు. కానీ... మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య ఉన్న స్నేహానుబంధం తెరపై రిఫ్లెక్ట్ అయి రొమాంటిక్ సీన్స్‌కు రియల్‌గా ఉన్న అనుభూతి కలుగుతుంది" అని చెప్పాడు. అంతకుమించి ఏమీ లేదని వెల్లడించారు.

ప్రియమణి కాంబినేషన్లో 3వ చిత్రం "సాధ్యం" వస్తుంది. ఇందులో గతంలోకంటే మరింత ఘాటుగా సీన్స్ ఉన్నాయని తెలిసింది. అవి కూడా పరిధి మేరకే ఉంటాయని జగపతి బాబు అంటున్నాడు. కనుక కిస్సింగ్‌లనేవి టాలీవుడ్ కొత్త సక్సెస్ ఫార్ములా అన్నమాట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT