1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Love

Actress Tabu | Love | Builder | Akkineni Nagarjuna | బిల్డర్ లవ్‌లో టబు: మగాడితో తిరిగితే అది లవ్వేనా...?!!

టబు
మొన్నటివరకూ టబుకు టాలీవుడ్‌లో నాగార్జునతో ఎఫైర్ ఉండేదని వార్తలు వస్తుండేవి. హైదరాబాద్‌లోనే ఆమె ఎక్కువగా గడపడానికి కారణం అదేనని చాలామంది చెవినిల్లు కట్టుక మరీ చెపుతుండేవారు. కానీ ఇటీవల టబు రూటు మార్చిందని తెలుస్తోంది.

హైదరాబాదుకు చెందిన పెద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ బిల్డర్‌తో ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అతని పేరు ఇంకా బయటకు రాలేదు. ఈ మధ్యకాలంలో టబు ఎక్కడికి వెళ్లినా అతను ఆమె పక్కనే ఉండటంతో వ్యవహారం గుప్పుమంది.

ఆ మధ్య వైశ్రాయ్ హోటల్ కొత్తగా ప్రారంభించిన శాఖ ప్రారంభోత్సవానికి విఐపీలు వచ్చారు. అక్కడ తళుక్కుమని మెరిసి మళ్లీ మాయమైందట. అయితే ఓ మగాడితో కలిసి నడిచినంత మాత్రాన లవ్ అనేయడమేనా...? అని టబు కస్సుబుస్సు లాడుతోందట. రాసుకు పూసుకు తిరుగుతుంటే లవ్ కాక మరేమిటో...? అని ప్రశ్నిస్తున్నారు టాలీవుడ్ సినీజనం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT