1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Chiranjeevi

Mega star | Chiranjeevi | Prajarajyam | Chandramukhi2 | "చంద్రముఖి-2"లో మెగాస్టార్ చిరంజీవి..?!!

మెగాస్టార్
WD
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవి స్లిమ్‌గా మారడానికి వెనుక గల కారణం ఆయన తిరిగి సినిమాల్లో నటించడానికేనని మెగా ఫ్యాన్స్ చెపుతున్నారు. కాకపోతే ఎప్పటినుంచో అనుకుంటున్న "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" చిత్రానికి బదులు "చంద్రముఖి-2"లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి.

కన్నడంలో విష్ణువర్థన్ నటించిన ఆప్తరక్షక చిత్రం కర్ణాటక బాక్సాఫీసు వద్ద బద్దలుకొట్టి రికార్డులు సృష్టించింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో చిరంజీవితో తీయాలని తమిళ దర్శకుడు పి.వాసు కసరత్తు చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.

చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లుగా కథలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు వార్త. అంతేకాదు ఇందులో భాగంగా ఇప్పటికే చిరంజీవిని పి.వాసు కలిసినట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. కాగా చిరంజీవి మాత్రం రాజకీయాల్లో తనేమిటో నిరూపించుకున్న తర్వాతే మళ్లీ సినిమాలవైపు చూస్తానని అంటున్నారు. మరి మెగా ఫ్యాన్స్ కల ఎప్పటికి తీరుతుందో వేచి చూడాలి..!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT