1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. increased

Actress Ileana | increased | remuneration | Cinema | Dill Raju | Ram | రెమ్యునరేషన్ పెంచిన క్యూట్ అండ్ సెక్సీ బేబీ!

రెమ్యునరేషన్
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు పొందిన హీరోయిన్ ఇలియానా. ఈ క్యూట్ అండ్ సెక్సీ బేబీ తన రెమ్యునరేషన్‌ను ఆమాతం పెంచేసింది. యువ హీరో రామ్ సరసన "రామ రామ.. కృష్ణ కృష్ణ" అనే కొత్త చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలోనే తన పారితోషకాన్ని పెంచినట్టు చిత్ర పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ భామ రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు అందుకుంటున్నారు. 

ఈ మొత్తాన్ని రూ.కోటి నుంచి రూ.1.10 కోట్ల వరకు పెంచినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం కూడా కేవలం 65 రోజుల కాల్షీట్‌కు మాత్రమే. ఇదిలావుండగా, షూటింగ్ సమయంలో హీరోయిన్ కలిగించే ఇతర సౌకర్యాలు, రవాణా, బస తదితర ఖర్చులన్నీ కలుపుకుంటే.. ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ అవుతుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై "దిల్" రాజు నిర్మిస్తుండగా, శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. "లీడర్" చిత్రంలో వెండి తెరకు పరిచయమైన ప్రియా ఆనంద్ మరో హీరోయన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రంలో 'యాక్షన్ కింగ్' అర్జున్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఎంఎంకీరవాణి సంగీత బాణీలు అందిస్తుండగా, బ్రహ్మానందం, గ్రేసీ సింగ్, బ్రహ్మాజీలు ఇతర తారాగణం. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
About Writer
PNR