1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Ye maya Chesave

Actor Nagachaitanya | Ye maya Chesave | Kiss | అక్కడ "ముద్దు" పబ్లిక్‌గా పెట్టుకోవచ్చు: నాగచైతన్య

నాగచైతన్య
"ఏ మాయ చేసావె"లో కిస్ సీన్స్ గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతూనే ఉంది. ఛాన్సు దొరికినపుడల్లా చిత్రం హీరోహీరోయిన్లను సినీజనం ముద్దు గురించి అడుగుతూనే వున్నారు. ఇదే విషయంపై నాగచైతన్యను అడిగినపుడు.. తను ముద్దు పెట్టిన సీన్ అభ్యంతరకరంగా లేదనీ, కథ మేరకే దర్శకుడు అలా చేయమన్నారని చెప్పారు. 

మొదటిగా న్యూజీలాండ్‌లో క్లైమాక్స్ సీన్ షూట్ చేశారనీ, అక్కడ కిస్ సీన్ పబ్లిక్‌గా పెట్టుకోవచ్చని తెలిపాడు. కనుక... ముందుగా హీరోయిన్‌ను అక్కడే కిస్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ ధైర్యంతోనే మొదటి భాగంలో రైల్వే ప్రయాణంలో కిస్ చేశాననీ, దాంతో ముద్దు పెట్టుకునేటపుడు ఉండే బెరుకు కాస్తా పోయిందని వివరించారు.

ఏదేమైనా ముద్దులివ్వడంలో తండ్రికి తగ్గ కొడుకుగా నాగచైతన్య పేరు తెచ్చుకుంటున్నాడన్నమాట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT