1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sexy acting

Hot Actress Kangana Ranout | Sexy acting | Prabhas | అందాలు ఆరబోయనిదే ఎవరూ చూడరు: కంగనా

హాట్ నటి
"ఏక్ నిరంజన్" చిత్రంలో ప్రభాస్ ప్రక్కన నటించిన కంగనా రనౌత్ మత్తు కళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్నా పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ బాలీవుడ్‌లో జాతీయ అవార్డు స్థాయికి ఎదిగింది. తాను ముఖానికి రంగేసుకున్నప్పటినుంచీ ఏదో అవార్డు పొందుతూనే ఉన్నాననీ అంటోంది. 

తన చిత్రం గ్యాంగస్టర్‌కు వచ్చిన అవార్డు ఆ చిత్ర రూపకర్తలకే అంకితమని చెబుతోంది. నో ప్రాబ్లమ్, ఇంకా పేరుపెట్టని రెండు చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.

ఇప్పటిదాకా తాను చేసిన పాత్రలన్నటిలోనూ మంచి గుర్తింపు వచ్చిందని గొప్పలు చెప్పుకుంటోంది. అయితే హీరోయిన్లు అందాలు ఆరబోయనిదే ఎవరూ చూడరని బల్లగుద్ది చెపుతోంది.

ఒకవేళ ఎవరైనా నేను చూపించను అని ముడుచుక కూచుంటే.. మరో నటి ఆరబోయడానికి సిద్ధమవుతోందని చెప్పుకొస్తోంది. ఇంతగా చెపుతుందంటే తదుపరి చిత్రాల్లో ఎంత మేరకు ఆరబోసేందుకు సిద్ధమవుతుందో చూడాలి మరి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT