1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Marriage

Actress Nagma | Marriage | National politics | పెళ్లి చేసుకోబోతున్నా... కానీ అతని పేరు చెప్పను

నగ్మ
ఎన్నాళ్లగానో పెళ్లి చేసుకుందామని ఎదురు చూస్తున్న నగ్మా కల నిజమవనుంది. చెల్లెలు జ్యోతికకు పెళ్లైన దగ్గర్నుంచీ వివాహం చేసుకోవాలని నగ్మా శతవిధాలా యత్నించి చివరికి ఓ వరుడు తారసపడటంతో అతడిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. 

అంతకు ముందు ఎడమచేతి వాటం క్రికెటర్ సౌరవ్ గంగూలీతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత భోజ్‌పురి సినిమాలకు వెళ్లి అక్కడ ఓ హీరోతో లవ్వాట సాగించింది. అయితే వాళ్లిద్దరితో ఉన్నది ప్రేమ సంబంధం కాదనీ, స్నేహ సంబంధమని ఆ తర్వాత అందరినీ బుకాయించిందనుకోండి.

ఆ సంగతి అలావుంచితే... రాజకీయాలు, సినిమాలు పెళ్లికి అడ్డంకిగా నిలుస్తాయని సదరు వరుడు కండిషన్లు పెట్టడంతో వాటిని సైతం వదులుకునేందుకు ఈ ప్రౌఢ సుందరి సిద్ధమైనట్లు భోగట్టా. 2009 ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ తర్వాత రాజకీయ కెరీర్‌పైనా ఆశ వదులుకుని చివరికి ఇల్లాలి పాత్ర పోషించడానికి రెడీ అయింది.

వివాహమాడబోతున్న వరుడెవరో చెప్పమంటే "ష్.. అతని పేరు మాత్రం అడక్కండి. నేను చెప్పను" అంటోంది. ఎవరైనా పెళ్లి చెడగొడతారని భయమేమో..?!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT