1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. IPL 2010

Actress Deepika Padukone, Siddharth | IPL 2010 | Royal Challengers | Vijay Mallya | Kingfisher | "ఛాలెంజర్స్" సిద్ధార్థతో ప(దు)డుకునే చెట్టాపట్టాల్

సిద్ధార్థ్
దీపికా పదుకునే పేరు చెపితే కుర్రకారు మనసులు జివ్వుమంటాయి. ఇప్పుడా భామ ఐపీఎల్ 2010 క్రికెట్ పోటీలను వీక్షిస్తూ మహా బిజీగా ఉన్నది. ఆమె ఒక్కతే అనుకునేరు.. తోడుగా మరో యువకుడు కూడా ఆమె ఉంటున్నాడు. ఎవరని అనుకుంటున్నారా...? రాయల్ ఛాలెంజర్స్ యజమాని విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ. 

దీపికా పదుకునే ఎక్కడుంటే సిద్ధార్థ అక్కడ కనిపిస్తున్నాడనే కంటే సిద్ధార్థ ఎక్కడ ఉంటే పదుకునే అక్కడ ఉంటోందని చెప్పవచ్చు. వీళ్లద్దరూ ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నారట. ఉన్నట్లుండి ఇద్దరూ మాయమై అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారట. ఎక్కడికి వెళుతున్నారబ్బా...? అని కొంతమంది సినీజీవులు వారిని వెంటాడే పనిలో ఉన్నారట.

ఆ సంగతి అలావుంటే విజయ మాల్యా కుమారుడు సిద్ధార్థ దీపికా పదుకునేతోపాటు ఆమె స్నేహితులను కూడా చాలా చక్కగా చూసుకుంటున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా దీపికానే చెపుతోందట. ఎక్కడ మ్యాచ్ ఉంటే అక్కడికి తన స్నేహితులను కింగ్ ఫిషర్ విమానాల్లో చేరవేస్తూ సరదా చేస్తున్నాడని సిద్ధార్థను పొగడ్తలతో ముంచెత్తుతోందట.

దీపికా వ్యవహారం చూసిన కొంతమంది సినీజనం... ఈ బంధం మరింత దృఢమైన ప్రేమ బంధంగా మారుతుందేమోనంటూ అప్పుడే వార్తలు రాసి పారేస్తున్నారు. వాళ్లు చెప్పేది నిజమవుతుందంటారా...?!! మనమూ చూద్దాం..!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT