1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Ranjita

Nityananda | Ranjita | sexual scandal | Hyderabad | Haridwar | రంజితను నిత్యానంద "స్వామి" మళ్లీ రమ్మన్నాడట

నిత్యానంద
వెనకటికెవరో చెప్పినట్లే... అటువంటి సహవాసం 90 ఏళ్లయినా అలాగే అంటిపెట్టుకుని ఉంటుందట. ఎవరు మటుకు తొలిసారిగా ప్రేమామృతం పంచిన ప్రియురాలు/ప్రియుడిన మరిచిపోతారూ...? దీనిని నిజం చేస్తున్నట్లున్నారు తమిళనాట సెక్స్ స్వామిగా పిలువబడుతున్న నిత్యానంద - రంజితలు. 

వీరిద్దరి సెక్స్ వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ ఇద్దరూ వాటిని చాలా తేలిగ్గా కొట్టి పారేశారు. అంతేకాదు తమ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మీడియాలో కనబడినప్పుడల్లా చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే తాజాగా నిత్యానందతో రంజిత రహస్యంగా సమావేశమైనట్లు కోలీవుడ్ వర్గాలు గుసగుసలు పోతున్నాయి.

ఇటీవల తాను మౌనముద్ర దాలుస్తున్నానని మీడియాతో చెప్పిన నిత్యానంద, రంజితతో కలిసి తమపై వచ్చిన అభియోగాలకు ఎలా చెక్ పెట్టాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇంతకీ వీళ్లద్దరూ ఎక్కడు కలుసుకున్నారని కొంతమంది సినీ జీవులు అత్యంత రహస్యంగా వారిని వెంబడిస్తే... రంజిత మొన్నటివరకూ హైదరాబాదులో ఉండి తాజాగా నిత్యానంద బస చేసిన హరిద్వార్‌లో తేలిందట.

మొత్తమ్మీద ఇద్దరూ కలిసి తమపై వచ్చిన అభియోగాలు పూర్తిగా నిరాధారమైనవని బహిరంగంగా చెప్పేందుకు సన్నద్ధమవుతున్నట్లు భోగట్టా. ఒకవేళ నిత్యానంద - రంజితలు ఇదే విషయాన్ని చెపితే వీడియో కళ్లకు దొరికి రాసలీలకు పాల్పడిన వారెవరో నిగ్గు తేల్చాల్సి ఉంటుంది మరి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT