Actor Ramcharan Teja | Orange | Megastar | Anjana Productions | నాన్నా... నాగుపాము డ్యాన్స్ చేస్తా: రామ్ చరణ్ తేజ
WD
మెగా "ఘరానా మొగుడు" చిత్రంలోని 'బంగారు కోడిపెట్ట...' పాటను మగధీరలో కొత్త బాణీలో రామ్ చరణ్ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించిన నేపధ్యంలో నాటి మెగా హిట్ "ఖైదీ"లోని 'రగులుతోంది మొగలి పొద..' పాటను "ఆరెంజ్"లో వాడుకునేందుకు రంగం సిద్ధమైంది.
ఈ పాటకోసం రామ్ చరణ్ తేజ నాగుపాము డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీసు చేస్తున్నాడట. చిరంజీవి ఒక్కసారి లుక్కేసి ఓకే... ప్రొసీడ్ అంటే రామ్ చరణ్ పాము నాట్యంతో అలరించడానికి రెడీగా ఉన్నట్లు చిత్ర యూనిట్ చెపుతోంది.
అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సూపర్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు.
