1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Love

Actress Anushka | Love | Marriage | నన్ను భరించేవాడు కావాలి: అనుష్క

అనుష్క
ప్రేమ, పెళ్లి గురించి పదహారేళ్లున్నప్పుడున్న కలలు ఇరవై దాటాక ఉండవని అనుష్క అంటోంది. ప్రేమ గురించి అడిగితే.. ప్రేమా లేదూ... దోమాలేదు.. పని గురించి ఆలోచించడానికే టైం సరిపోవడం లేదు... ఇంకా ప్రేమ గురించి ఆలోచించే సమయమెక్కడిదీ..? అని ప్రశ్నిస్తోంది. 

అయినా వదలకుండా.. ఎవరినైనా ప్రేమించారా...? అని అడిగితే, తెరమీద వెంటపడే హీరోలను ప్రేమించడానికే నాకు సమయం సరిపోతోంది. ఇక నిజ జీవితంలో ప్రేమ గురించి మాట్లాడటానికేముంది...? అని ముక్తసరిగా చెబుతోంది.

ఒక వయస్సు వచ్చాక జీవితంలో నిజాలు కళ్లకు కనిపిస్తాయి. వరుడి గురించి నాలో పెద్దగా కలలు లేవు. మంచి మనిషి అయితే చాలంటోంది. మంచి మనిషంటే.. అన్నిటికీ మించి నన్ను భరించేవాడుగా ఉండాలని అసలు విషయం చెప్పేసింది. మరి ఏం భరించాలని అడిగితే మాత్రం చెప్పట్లేదు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT