Actress Preity Zinta, Yuvaraj Singh, Dating, Younger brother, | యువరాజ్ నా తమ్ముడులాంటి వాడు: ప్రీతి జింతా
FILE
మరైతే సోదరునితో మసలుకునే విధానంలో తేడా ఉందనీ, మరీ రాసుకుపూసుకు తిరగడమే కాక ఏకంగా వాటేసుకోవడమేమిటని కొందరు విలేకరులు ప్రీతిని నిలదీశారు. అంతే... వారిని కొరకొరా చూస్తూ, " ఆనందం వచ్చినప్పుడు దాన్ని అలా షేర్ చేసుకున్నా. పట్టలేని సంతోషం వచ్చినప్పుడు ఇలా ప్రవర్తించాలని ఎవరూ గిరి గీసుకుని ప్రవర్తించరు. నా టీమ్ సభ్యులందరూ నాకు కుటుంబ సభ్యులు లాంటి వారే. యువరాజ్ చిన్న తమ్ముడు లాంటివాడు" అని చెప్పింది.
అదిసరే..!! వివాహమైన ఓ పురుషుడితో పెళ్లి విషయమై మీరేమంటారూ...? అని మరో తుంటరి విలేకరి ప్రశ్నించినపుడు... "ఏంటయ్యా... పెళ్లైన పురుషునితో పెళ్లికాని అమ్మాయి ఎవరైనా ప్రేమలో పడుతుందా..? అంటూ రుసరుసలాడింది.
పెళ్లయిన ఓ హీరోతో సన్నిహితంగా ఉన్నట్లూ... అని సదరు విలేకరి మళ్లీ సాగదీయడంతో... "పెళ్లయిన మగాడితో పెళ్లికాని అమ్మాయి.. పెళ్లికాని అబ్బాయితో పెళ్లయిన స్త్రీ సన్నిహితంగా ఉంటే అది పెద్ద తంటా తెస్తుంది. అలావుంటే ఖచ్చితంగా ఒక కుటుంబం కూలిపోతుంది. కనుక అటువంటివాటికి ఛాన్సే లేదు. నేను బాధ్యత కలిగిన ఓ హీరోయిన్‌ని. వ్యాంప్‌ను కాదు. అస్సలు ప్రస్తుతం నేను ఎవరితోనూ డేటింగ్ చేయట్లేదు. ఇక చాలా...!!" అంటూ విసవిస నడుచుకుంటూ వెళ్లిపోయింది చొట్టబుగ్గల బ్యూటీ.
