Best Actor | Ram Charan | Magadheera | SSRajamouli | Srikanth | Nandi Awards | ఉత్తమ నటుడు రామ్‌చరణ్: బెస్ట్ మూవీ ''మగధీర''?
File
FILE2009లో వచ్చిన "మగధీర" చిత్రం తెలుగు చలన చిత్ర కలెక్షన్ల రికార్డులను బద్ధలు కొట్టిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన అందరి ప్రశంసలు అందుకుంది. దీంతో ఆయన 2009కి గాను బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకోవచ్చని తెలుస్తోంది. అలాగే, బెస్ట్ మూవీగా "మగధీర" చిత్రం ఎంపికయ్యే సూచనలు ఉన్నట్టు ఆ వర్గాలు అంటున్నాయి.
ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్.రాజమౌళికి నంది అవార్డు వరించవచ్చు. 'మగధీర' చిత్రానికి శ్రీకాంత్, కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన "మహాత్మా" మాత్రమే గట్టి పోటీ ఇస్తోంది. ఇటీవలే 2008 సంవత్సరానికి నంది అవార్డుల ప్రదానోత్సవం ముగిసిన తర్వాత 2009 సంవత్సర అవార్డులపై టాలీవుడ్‌లో రసవత్తర చర్చ సాగుతోంది.
