1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Gopichand

Actress Anushka | Gopichand | Marriage | Hyderabad | Banjara Hills | గోపీచంద్‌కోసం బంజారాలో అనుష్క కొత్త ఇల్లు..?!!

అనుష్క
నటుడు గోపీచంద్, అనుష్కల మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వాళ్లిద్దరి వ్యవహారాన్ని చూస్తే సమీప భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు. 

ఇది నిజమో కాదో కానీ, ప్రస్తుతం అనుష్క, గోపీచంద్‌లు చేస్తున్న పనులను చూస్తుంటే కొద్దో గొప్పో నిజమేనని అనుకోవలసి వస్తుందంటున్నారు టాలీవుడ్ సినీ జనం. గోపీచంద్‌ను తరచుగా కలుసుకునేందుకు వీలుగా అనుష్క బంజారా హిల్స్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అనుష్క సంగతి ఇలా ఉంటే, గోపీచంద్ కూడా ఫిలిమ్ నగర్‌లో ఓ కొత్త ఇంటిని కొనేందుకు వెతుకుతున్నట్లు వినికిడి. అనుకున్నట్లుగానే ఇళ్లు కుదిరితే త్వరలోనే ఇద్దరూ ఒకింటి వారయ్యే రోజు ఎంతో దూరంలో లేదని టాలీవుడ్ అంటోంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT