Samantha | Ram Charan Teja | Mahesh Babu | Prabhas | Tollywood | సమంతను "బుక్" చేసుకున్న రామ్ చరణ్ తేజ్!
File
FILEఆ వెనువెంటనే జూనియర్ ఎన్టీఆర్ నటించే "బృందావనం" చిత్రంలో రెండో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో జూనియర్‌తో డైరక్ట్ కిస్సింగ్ సీన్లలో సమంత ఇరగదీసినట్టు హైదరాబాద్ ఫిల్మ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇదిలావుండగా, జూనియర్ మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్ దృష్టి సమంతపై పడింది. అందుకే తాను నటించే తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసుకున్నారు. ధరణి దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది.
ప్రస్తుతం అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగబాబు నిర్మిస్తున్న "ఆరంజ్" చిత్రం షూటింగ్‌లో రామ్ చరణ్ తేజ్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ దేశ విదేశాల్లో శరవేగంగా జరుపుకుంటున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ తేజ్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.
రామ్ చరణ్ సరసన మాత్రమే కాకుండా మరికొందరు యువ హీరోల సరసన సమంత నటించనుంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించే చిత్రంతో పాటు.. శ్రీనువైట్ల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించే మరో కొత్త చిత్రంలోనూ సమంత హీరోయిన్‌గా నటించనుంది.
