1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Chicken fox

Samanta | Chicken fox | Brindavanam | NTR, Ramcharan Teja | Kajal Agarwal | Ye Maya Chesave | "సమంత"కు చికెన్ పాక్స్: బృందావనం షూటింగ్ రద్దు..!?

సమంత
WD
"ఏ మాయ చేసావె" హిట్‌తో ఆ సినిమా హీరోయిన్ సమంతకు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా దిల్‌రాజు నిర్మిస్తున్న "బృందావనం"లో సమంత రెండో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవలే కేరళలో ఈ సినిమా షూటింగ్‌ను కొద్దిరోజుల పాటు జరిపారు. అక్కడ సమంత అనారోగ్యంపాలు కావడంతో ఒక్కరోజు విశ్రాంతి ఇచ్చారు. మరుసటిరోజు చికెన్‌ పాక్స్ అని తేలడంతో మొత్తం యూనిట్ ప్యాకప్ అయి తిరిగి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సమంత లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బహూశా వచ్చేనెలలో ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత చిత్ర యూనిట్ కేరళకు వెళ్ళనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. "ఏ మాయ చేసావె" చిత్రం ద్వారా మాస్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న సమంతకు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే రామ్‌చరణ్ తేజతో కొత్త చిత్రానికి బుక్ అయిన సమంత, ఎన్టీఆర్ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా సమంతను బుక్ చేసుకోవడానికి నిర్మాతలు ఆమె ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.