1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Dil Raju

Marocharitra | Dil Raju | K.Balachander | Varun Sandesh | Anita | దిల్‌రాజు "మరోచరిత్ర": ''ప్చ్''.. లాభంలేదన్న సెన్సార్..!?

మరోచరిత్ర
కె. బాలచందర్ సృష్టించిన "మరోచరిత్ర" చిత్రాన్ని ఈనాటి ట్రెండ్‌లో అయితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్న దిల్‌రాజుకు తన సినిమాపై ఎంత నమ్మకముందోగానీ, అంతకు ముందుగానే పలురకాల ప్రచారాలు చేస్తున్న ఒరవడి ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. 

ఇప్పటికే సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి "ప్చ్.. లాభంలేదని.." తేల్చేశారని విశ్వసనీయ సమాచారం. హీరోయిన్ అనిత ప్రధాన మైనస్‌గావడమేకాకుండా దర్శకత్వంపై కూడా విమర్శలు చేశారు. దీంతో దిల్‌రాజు చిత్రంపై నెగటివ్ ఫీలింగ్ ఏర్పడుతుందనే భావనతో ముందుగానే ఈ సినిమా యూనిట్ మరోచరిత్ర విజయయాత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నిన్నటితో రాష్ట్రంలో అన్ని థియేటర్లలో ఈ యాత్ర ముగిసింది. కానీ ఎక్కడా సరైన మరోచరిత్ర యాత్రకు స్పందన కానరాలేదు. దీంతో కొన్ని చోట్ల చిత్రయూనిట్‌తో తిరగాల్సిన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.

మరోవైపు.. దిల్‌రాజు తన పైసా ఖర్చుపెట్టకుండా తన పేరును వాడుకుంటున్న వారి నుంచి కొంత మొత్తాన్ని రాబట్టుకున్నాడు. అతని బంధువులైన వ్యక్తులు మ్యాట్నీ ఎంటర్‌టైనర్ బేనర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక తన పేరు వాడుకుంటున్నాడు కాబట్టి ప్రచార బాధ్యతను తనపై వేసుకున్నాడు. ఆల్‌రెడీ అలాంటి బాధ్యతలు గతంలో కూడా చేశాడు ఏ చిత్రమూ విజయవంతం కాలేదు. మరోవైపు ఈ చిత్రానికి పెద్దక్రేజ్ లేకపోవడంతో వ్యాపారంకూడా సరిగ్గాకాలేదు. స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి "మరోచరిత్ర" విడుదల చేస్తున్నారు.

ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు హీరో వరుణ్‌సందేశ్‌కు పెద్దగా పేరు లేకపోవడం చిత్రానికి కూడా మైనసేనని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.