Actress Sradda doss | Sexy | Tollywood | Hollywood | ఛాన్సే కానీ ఛాయిస్ లేదు: శ్రద్దా దాస్
సినిమా పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే వాళ్లకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఛాయిస్ ఉండదని శ్రద్దాదాస్ అనుభవ పూర్వకంగా చెపుతోంది.
"నేనేమీ సినిమా కుటుంబానికి చెందిన దాన్ని కాదు. మా ఇంట్లో సినిమా వాళ్లెవరూ లేరు. అందుకే నిలదొక్కుకోవడానికి ఏ అవకాశం వచ్చినా కాదనకుండా చేస్తున్నాను. ఈ దశలో ఇష్టం లేకపోయినా కొన్ని పాత్రలు చేయాల్సిందే" అంటూ చెపుతోంది.
ఇక ఎక్స్‌పోజింగ్ గురించి చెపుతూ... బాలీవుడ్‌లో ఎలా కనిపించినా స్వీకరిస్తారు. తెలుగులో అలా కాదు. కాస్త పరిధి దాటితే అతి చేసిందంటారు. అందుకే పాత్రలను నిశితంగా గమనించిన మీదటే అంగీకరిస్తున్నాను అని చెప్పుకొచ్చింది శ్రద్ధా.
