1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Chandamama

Actress Sindhu menon | Chandamama | Subhadra | ప్రేమా...? అంటే ఏమిటీ..? సింధు మీనన్ ప్రశ్న

సింధుమీనన్
"చందమామ"లో అందంగా కన్పించిన సింధూ మీనన్ తాజాగా "సుభద్ర"తో ముందుకు వస్తుంది. ప్రేమ గురించి అడిగితే ముఖాన్ని ప్రశ్నార్థకంగా పెట్టింది. అసలు ప్రేమంటే ఏమిటి...? అని అమాయకంగా ప్రశ్నిస్తోంది. వెండితెర ప్రేమలు తెలుసు కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదని ఫోజులు కొడుతోంది. 

అదిసరే... పెళ్లి గురించి నీ అభిప్రాయం చెప్పవూ అని అడిగితే... ఏదైనా ఇద్దరికీ అతకాలి. ఒదిగి పోవాలి. అయితే ప్రేమ పేరుతో పెద్దవారికి చెప్పకుండా పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకే కదా మంచి చెడ్డలు తెలిసేది. అందుకే నేను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాను అంటోంది. నమ్మేద్దామా...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT