1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Balakrishna

Simha | Balakrishna | Telugudesam chief | "సింహా" తర్వాత తెదేపా కుర్చీలో బాలయ్య..?!!

సింహా
WD
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మరో పవర్‌ఫుల్ చిత్రం సింహా. ఈ చిత్రంతో బాలయ్య సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడని టాలీవుడ్‌లో గుసగుసలు పోతున్నాయి. సింహా చిత్రం తర్వాత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని బాలయ్య అనుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

బాలయ్య బాబుకు తెదేపా పగ్గాలివ్వాలని ఇటీవల లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించకపోవడం ఈ విషయానికి మరింత ఊతమిస్తోంది. లక్ష్మీ పార్వతితోపాటు నందమూరి హీరోలందరి అభిమతం కూడా బాలకృష్ణకు కుర్చీ అప్పజెప్పాలన్నదేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం బాలయ్య బాబు అంశంపై నోరు మెదపడం లేదు. పైగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద బావ హరికృష్ణను పొగడ్తలతో ఆకాశానికెత్తాశారు. బాబు వ్యూహాలు అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టమే మరి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT