Ritesh Deshmukh | Jacqueline Fernandez | Dating | Geneelia | కొత్త "జాక్వెలిన్" ఒక వింత.. పాత "జెన్నీ" ఒక రోత
రితేష్ దేశ్‌ముఖ్ పేరు వినగానే మనకు చటుక్కున గుర్తుకు వచ్చేది కోనకళ్ల సుందరి జెనీలియా పేరు. ఈ బక్కపలచని భామను రితేష్ దేశ్‌ముఖ్ వివాహమాడబోతున్నాడని ఆ మధ్య బలంగా వార్తలు కూడా వచ్చాయి. కానీ కొత్తొక వింత.. పాతొక రోత అనే సామెతలా రితేష్ మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది.
మరాఠీ సంప్రదాయ పండుగు గుడిపడ్వా రోజునాడు కొత్త గాళ్‌ఫ్రెడ్ జాక్వెలిన్‌తో రితేష్ చాలా క్లోజ్‌గా గడిపాడట. ఇద్దరూ దాదాపు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా సంప్రదాయ దుస్తులు ధరించి ఒకరికొకరు చాలా సన్నిహితంగా మెలిగారట. చూసిన వారంతా ఇద్దరి మధ్య బంధం తారాస్థాయికి చేరుకుందని గుసగుసలాడుకున్నారట.
అయితే జాక్వెలిన్ మాత్రం ప్రేమికులందరూ చెప్పే "మేము స్నేహితులం మాత్రమే" అనే డైలాగు చెప్పిందట. ఎంతమంది స్నేహితులైన ప్రేమికులను మనం చూడటం లేదూ... అన్నట్లు పాత గాళ్ ఫ్రెండ్ జెనీలియా సంగతేమిటో..?!!
