Junior NTR | Lakshmi Pranita | Marriage | Nandamuri fans | ఏప్రిల్ 1న జూనియర్ ఎన్టీఆర్- ప్రణీతల నిశ్చితార్థం..?!!
WD
అయితే కొన్ని ఛానళ్లు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెపుతున్నాయి. ఇదే సమయంలో మరికొన్ని ఇప్పుడు కాదంటున్నాయి. ఇదిలావుంటే జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థం నిజమైతే పెద్ద ఎత్తున సందడి చేసేందుకు నందమూరి అభిమానులు సిద్ధమయ్యారు. అయితే నందమూరి కుటుంబం నుంచి ఎటువంటి కబురు రాకపోవడంతో మిన్నకుండి పోయారు.
లక్ష్మీ ప్రణీత మేజర్ కాదనీ, మైనర్ బాలిక అయిన అమ్మాయిని జూనియర్ ఎన్టీఆర్ ఎలా వివాహమాడతాడని అప్పట్లో పలువురు విమర్శించారు. ఈ మార్చి నెలతో లక్ష్మీ ప్రణీతకు 18 ఏళ్లు నిండటంతో నిశ్చితార్థానికి ఎటువంటి అడ్డంకులు ఉండబోవని అంటున్నారు.
