1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Prabhas

Shraddha Das | Prabhas | Darling | Arya2 | Maro Charitra | Allu Arjun | Kajal Agarwal | Billa | ప్రభాస్ "డార్లింగ్"లో శ్రద్ధాఆర్య ఐటమ్ సాంగ్ వరకేనా...!?

శ్రద్ధాదాస్
బిల్లా హీరో ప్రభాస్, మగధీర హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "డార్లింగ్" చిత్రంలో.. కత్తిలాంటి అమ్మాయి శ్రద్ధాదాస్ గ్లామర్ పాత్రను పోషిస్తోందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. 

ఇటీవల విడుదలైన ఆర్య-2, మరో చరిత్ర చిత్రాల్లో రెండో హీరోయిన్ తరహా పాత్రల్లో కనిపించిన శ్రద్ధాదాస్... అలాంటి పాత్రలకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని సమాచారం. ఆర్య-2, మరోచరిత్ర చిత్రాల్లో పోషించిన కీలక పాత్రల ద్వారా శ్రద్ధాదాస్‌కు మంచి గుర్తింపు వచ్చిందని... అందుకే అమ్మడు హీరోయిన్ రోల్స్‌పై దృష్టి పెట్టనంటోందని సినీ జనం అంటున్నారు.

కానీ కథానాయిక ఛాన్సులు అమ్మడుకు ఎక్కువగా రాకపోవడంతోనే దొరికిన ఛాన్సులను మిస్ చేసుకోకుండా రెండో కథానాయిక పాత్రలను పోషించడంలో శ్రద్ధాదాస్ ఆసక్తి చూపుతోందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.

ఇంకా చెప్పాలంటే..? అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య-2తోనే శ్రద్ధాదాస్‌కు క్రేజ్ పెరిగిందని, అందుకే అలాంటి రోల్స్ చేయమని నిర్మాతలు అడిగిన వెంటనే ఆమె ఒప్పేసుకుంటుందని తెలిసింది.

కాగా.. త్వరలో విడుదల కానున్న ప్రభాస్ డార్లింగ్‌లోనూ శ్రద్ధాదాస్ గ్లామర్ రోల్ చేస్తుందని వినికిడి. అయితే శ్రద్ధాదాస్‌కు డార్లింగ్‌లో రెండో కథానాయిక పాత్రను ఇవ్వకుండా.. ఐటమ్‌సాంగ్‌కు మాత్రమే కనిపించనుందని సమాచారం.

ఈ ఐటమ్‌సాంగ్‌లో అందాలు ఉట్టిపడే గ్లామర్‌ డ్యాన్స్‌తో మాస్‌ను కట్టిపడేస్తుందని సినీ వర్గాల్లో టాక్. మరి "డార్లింగ్"లో శ్రద్ధాదాస్ ఒక్క ఐటమ్‌సాంగ్‌కే పరిమితమవుతుందో..? లేదా స్క్రిప్ట్ ప్రకారం కీలక పాత్ర పోషిస్తుందో..? సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే..!
About Writer
SELVI.M