Sania mirza | Shoaib Malik | love story | Miss India | Sayali Bhagat | షోయబ్ మాలిక్: పెరుగుతున్న ప్రియురాళ్ల సంఖ్య
ఒకవైపు సానియా - మాలిక్‌ల పెళ్లికి రోజులు దగ్గరపడుతుంటే మరోవైపు రోజురోజుకీ షోయబ్‌కున్న కొత్త ప్రియురాళ్ల సంఖ్య పెరుగుతూ పోతున్నట్లు కనిపిస్తోంది. అయేషా సిద్దికి, సానియా మీర్జాలకంటే ముందు షోయబ్ మాలిక్ మరో అమ్మాయితో ప్రేమాయణం సాగించాడని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రియురాలు ఎవరంటే మాజీ మిస్ ఇండియా సాయాలీ భగత్. ఈ అమ్మడుతో మాలిక్ చాలాకాలం లవ్వాట సాగించాడని వార్తలు వస్తున్నాయి.
సాయాలి మాత్రం షోయబ్ మాలిక్ ఎవరో తనకు తెలియదని చెపుతోంది. కానీ ఆమెతో సినిమా తీయాలనుకున్న ఓ డైరెక్టర్ మాత్రం సాయాలీ భగత్- షోయబ్ మాలిక్‌ల లవ్ స్టోరీ నిజమేనని అంటున్నాడు. మాలిక్ మాత్రం సానియా జపం తప్ప మరో మాట మాట్లాడటం లేదు. కదిలిస్తే... తన మనసులో సానియా తప్ప మరెవరకీ స్థానం లేదని చెపుతున్నాడు. మరి సాయాలీ భగత్ సంగతో... అంటే ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోతున్నాడట.
కానీ డైరక్టర్ విల్సన్ లూయిస్ మాత్రం షోయబ్- మాలిక్‌ల మధ్య ప్రేమాయణం నడిచినట్లు బల్ల గుద్ది మరీ చెపుతున్నారు. తామిద్దరం కలిసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించాలని తనను సాయాలి, షోయబ్ అడిగారనీ, వారిద్దరు హీరోహీరోయిన్లగా పరిచయం చేస్తూ సినిమా తీయడానికి నిర్మాత కూడా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. కథ విషయానికి వస్తే... క్రికెట్ ఆటగాడు ఓ మాజీ మిస్ ఇండియాతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వారిద్దరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది సారాంశం.
