1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Bikini

Genelia | Bikini | Ram charan Teja | Orange | రామ్ చరణ్ కోసం బికినీ వేయమంటే వేస్తా: జెన్నీ

జెనీలియా
ఇవాల్టి రోజుల్లో ప్రతీ హీరోయిన్ టూ పీస్ దుస్తులను ధరించి నటించడం మామూలై పోయిందని సెక్సీ నటి జెనీలియా అంటోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో "మగధీర" రామ్ చరణ్‌తో నటిస్తున్న ఈ "ఆరెంజ్" సుందరి దర్శకనిర్మాతలు కోరితే తాను కూడా బికినీ వేసేందుకు అభ్యంతరం పెట్టనని అంటోంది. 

ముఖ్యంగా రామ్ చరణ్ తేజ సరసన నటిస్తున్న "ఆరెంజ్" చిత్రంలో అటువంటి సన్నివేశాలు ఉన్నట్లయితే, బికినీతో కనిపించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదని తన మనసులో మాటను చెప్పేస్తోంది జెనీలియా. అయితే ఆ సన్నివేశం బికినీ వేసుకుని కనిపించేందుకు అన్నట్లు కాకుండా సందర్భోచితంగా ఉండాలంటోంది.

రామ్ చరణ్ తేజ "ఆరెంజ్" చిత్రంలో మషాలా దట్టింపులున్న సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్లు వినికిడి. ఎలాగూ బికినీ సన్నివేశాలుంటాయి కనుక జెనీలియా ముందుగానే ఇలా వార్మప్ చేస్తోందా...? చూద్దాం... ఆరెంజ్ వస్తే తెలుస్తుంది కదా...!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT