1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Katrina

Salman Khan | Katrina | love story | Photos | కత్రినా బ్యాగులో సల్మాన్ ఖాన్ ఫోటో దర్శనం

సల్మాన్ ఖాన్
ఇపుడంతా లవ్ స్టోరీలు సుఖాంతమయ్యే కాలం నడుస్తున్నట్లుగా కనబడుతోంది. ప్రేమ పేరుతో పెనవేసుకున్న జంటలు పెళ్లితో ఒకటయ్యే రోజులు ఈ 2010లోనే ఉన్నట్లు కనబడుతోంది. అసలు సంగతి చెప్పకుండా ఏంటీ డొంక తిరుగుడు అంటారా...? మరేం లేదండీ, సల్మాన్ ఖాన్ పేరు చెబితేనే తప్పించుక తిరిగే కత్రినా కైఫ్ తన బ్యాగులో అతని ఫోటో పెట్టుక తిరుగుతోందట. 

ఆ విషయాన్ని గమనించిన ఓ తుంటరి విలేకరి... సల్మాన్‌ను మీరు మరిచిపోయినట్లు లేరే...? అనడిగితే, డొంక తిరుగుడు సమాధానం చెప్పిందట. "మీకిష్టమైన నటీనటులు ఫోటోలు మీరు పెట్టుకోరూ... మీరు బాగా ఇష్టపడే ఎవరైనా హీరోయిన్ ఫోటోను మీ పర్సులో పెట్టుకుని తిరుగుతుంటే, దాన్ని ఏమనాలి..? ఇష్టమైనవారి ఫోటోలు బ్యాగుల్లోనే కాదు, గదుల్లో కూడా ఉంటాయ"ని షాకింగ్ న్యూస్ చెప్పిందట.

కత్రినా క్లాసుతో బుర్ర వేడెక్కిపోయిన సదరు తుంటరి జర్నలిస్టు ఆమెను మరో ప్రశ్న అడిగే సాహసం చేయలేదట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT